టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యనే మెగాస్టార్ ఇంటి నుండి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి పెళ్లి బాజా మోగిన సంగతి మనకు తెలిసిందే..అలాగే ఇప్పుడు మరో హీరోయిన్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు వారు ఎవరనుకున్నారా. మిల్కీ బ్యూటీ తమన్నా అలాగేవిజయ్ వర్మల వివాహం వచ్చే సంవత్సరం ఉండవచ్చు అని తెలుపుతున్నారు.
ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ బిజీగా ఉన్న తమన్నా మొట్ట మొదటిగా తెలుగు ఇండస్ట్రీకి శ్రీ అనే చిత్రంతో పరిచయమై పలు సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఆ తరువాత బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అంతేకాకుండా వెబ్ సిరీస్, సినిమాల
లు చేసుకుంటూ చాలా బిజీగా వున్న నటీమణుల్లో తమన్నా ఒకరు.
ఇక తమన్నా పెళ్లి చేసుకోబోతున్న నటుడు విజయవర్మ ఈయన హైదరాబాద్ కి చెందిన వ్యక్తి వీరిద్దరికి రిలేషన్షిప్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.. మొదట్లో కొన్నాళ్ళు ఇద్దరూ ఈ రిలేషన్ షిప్ గురించి దాచినా, తరువాత బహిరంగంగానే తాము ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆ తరువాత వీరిద్దరూ ఎన్నో ఫంక్షన్స్ లో కలిసి వెళ్లారు. అయితే తమన్నాకు ఇప్పటికీ 33 ఏళ్లు.. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ని కాస్త వివాహంగా మార్చుకోవాలని అనుకుంటున్నారట.
వచ్చే ఏడాదిలో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమన్న కుటుంబ సభ్యులు కూడా వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీంతో తమన్నా విజయ్ ఇద్దరు కలిసి తన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది.. అలాగే ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి వివాహానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఏదైతేనేమి నెక్స్ట్ ఇయర్ తమన్నా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.