ఇటీవల కాలంలో చాలామంది ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరీ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేజిఎఫ్ సినిమా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించకున్న నటుడు వశిష్ట టాలీవుడ్ హీరోయిన్ ను వివాహం చేసుకున్నాడు.. అసలు విషయంలోకి వెళ్లి.. శాండల్ వుడ్ నటి హరిప్రియ – వశిష్ట సింహతో పెళ్లికి సిద్ధమయ్యింది డిసెంబర్ రెండవ తేదీన వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఇద్దరూ తమ ఎంగేజ్మెంట్ ఫోటోలను తాజాగా ఇన్ స్టా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..” మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాము. మా నిశ్చితార్థం వేడుక జరిగింది.. మీ ఆశీస్సులు కావాలి.” అని పోస్ట్ పెట్టారు. బెంగళూరులోని హరిప్రియ నివాసంలో ఈ నిశ్చితార్థ వేడుక జరగగా.. ఈ కార్యక్రమానికి విశిష్ట – హరిప్రియ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.. ఈ నిశ్చితార్థ వేడుకలలో హరిప్రియ పసుపు రంగు దుస్తులలో ముస్తాబు కాగా వశిష్ట పసుపు రంగు షర్టు, దోతిని ధరించి చాలా అద్భుతంగా కనిపించారు.
ఇక హరిప్రియ విషయానికి వస్తే.. తకిట తకిట సినిమా ద్వారా తెలుగు పరిచయమైన ఈమె ఆ తర్వాత పిల్ల జమిందార్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, జై సింహ , గలాట వంటి సినిమాలలో నటించింది . ఇకపోతే కేజీఎఫ్ లో కమల్ పాత్ర పోషించిన సింహాతో కొంతకాలం ప్రేమలో ఉన్న ఈమె ఇప్పుడు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.