ఇప్పుడు సినిమా అవకాశాలు రావాలి అంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అమ్మాయి ఎంట్రీ ఇవ్వడం అంటే పెద్ద సాహసమని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఇలాంటి వారికి హీరోయిన్గా అవకాశాలు రావాలంటే మాత్రం వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.. ముఖ్యంగా ఇలాంటి వాటిలో క్యాస్టింగ్ కౌచ్ కూడా ఒకటి. మరి కొంతమంది కమిట్మెంట్ కూడా ఒప్పుకునే పరిస్థితికి ఏర్పడుతుంది.
కొంతమంది అయితే ఈ విషయాన్ని అసలు ఒప్పుకోరు కేవలం టాలెంట్ తోని పైకి వస్తామని తెలియజేస్తూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్స్ సైతం కనుమరుగైన వారు చాలామంది ఉన్నారు.. మీటూ ఉద్యమం తర్వాత చాలామంది ఈ విషయం పైన స్పందించడం జరిగింది. తాజాగా హీరోయిన్ ఇలియానా కూడా ఈ విషయం పైన స్పందించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నా ఇమే రీసెంట్గా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ పెను సంచలనాలని సృష్టిస్తోంది.
ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఇలియానా.. తను గతంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను పంచుకోవడం జరిగింది.. నేను మొదట్లో టాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు కొంతమంది స్టార్ హీరోలు కూడా తనని కమిట్మెంట్ అడిగారని తెలియజేసింది.. అంతేకాకుండా కొంతమంది స్టార్ డైరెక్టర్లు కూడా ఆ లిస్టులో ఉన్నారని కానీ నేను దానికి అసలు ఒప్పుకోలేదు.. తన సొంత టాలెంట్ తోనే అవకాశాలు వచ్చేలా చేసుకున్నానని తెలుపుతోంది.
అయితే ఈమె సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన తర్వాత అదే స్టార్ హీరోలు తనకు అవకాశాలు ఇచ్చారు అందుకే నేను వారి పేర్లు చెప్పలేదు ఇప్పటికే నాకు స్టార్ హీరోలు చాలా సన్నిహితంగానే ఉండాలంటే తెలియజేస్తోంది ఇలియానా. ఇలియానా ఇలియానా చేసిన ఈ కామెంట్లను ఆ స్టార్ హీరోలు డైరెక్టర్లు ఎవరు అనే విషయంపై అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు.