బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా అందాల తార ఆలియాభట్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా బ్రహ్మస్త్ర.. అయితే ఈ రోజు ఈ సినిమా పోస్టర్ ను తెలుగు లో కింగ్ నాగార్జున, అగ్ర దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఆలియాభట్ మీడియాతో మాట్లాడుతూ.. రాజమౌళి సర్ నన్ను ఈరోజు చాలా కన్ఫ్యూజ్ చేసేసారు.. ఇలాంటి బట్టలు వేసుకున్నందుకు నేనెవరో కూడా తెలియదు అంటున్నారు.. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ సినిమా.. ఎందుకంటే ఏడేళ్ల కష్టం ఈ సినిమా. కరణ్ చెప్పినట్టు ఇది మా అందరికీ ఒక ఎమోషనల్ మూమెంట్.. హైదరాబాద్లో పోస్టర్ రిలీజ్ చేయడానికి మేము అందరం వచ్చాము. 2022 సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే సినిమాకు భాష అడ్డుకాదని అందరికీ తెలిసిందే..
మీరు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని రాజమౌళి తో చెప్పింది ..నాగార్జున గురించి మాట్లాడుతూ.. నాగార్జున గారు మా నాన్నతో కలిసి పని చేశారు
. ఇప్పుడు నేను, ఆయన కలిసి పనిచేసాము . ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు. చిత్రం యూనిట్ మొత్తం నాగార్జున కోసం ఎదురుచూస్తూనే ఉండేవారు అలా ఎదురుచూసేలా ఆయన చేశారు అంటూ నాగార్జున పై ప్రశంసల వర్షం కురిపించింది