ఎస్ ఆర్ కళ్యాణమండపం హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇటీవల డిసెంబర్ 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను చనిపోయాడు. హీరో కిరణ్ తన సోదరుని తలుచుకొని ఆవేదన వ్యక్తం చేసాడు. తన సోదరుడితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని మరీ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తాజాగా తన సోదరుడు గురించి ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు హీరో కిరణ్.
ఒరేయ్ కిరా మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదురా. మన ఇద్దరిలో ఎవరో ఒకరం గట్టిగా సాధించాలిరా అని మా అన్నయ్య రామాంజులు రెడ్డి అనేవాడు. ఎక్కువగానే నన్ను సపోర్ట్ చేశాడు. తన సరదా, సంతోషాలను నా కోసం త్యాగం చేశాడు. ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నానని అనుకునేలోపు తను లేకుండా పోయాడు.
‘అందరికీ నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావురా?’ అని అప్పుడప్పుడు నన్ను అడిగేవాడు. ఏదైనా సాధించిన తరువాత పరిచయం చేద్దామనుకున్నా.కానీ ఇలా చేయవలసి వస్తుందని అనుకోలేదు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆనందం కోసం కష్టపడేవాళ్లు ఉంటారు.. అది మీరు పొందకుండా పోతే వాళ్లు తట్టుకోలేరు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.