బాహుబలిపై కన్నేసిన త్రిమూర్తులు…!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ చరిత్రలో కనివిని ఎరుగని రికార్డులు సృష్టించిన సినిమా ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తే ఠక్కున వచ్చే సమాధానం బాహుబలి1,2. ఈ సినిమాలు సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు భాషల్లో ఈ సినిమా రికార్డులే రికార్డులు సాధించి తెలుగు స్టామినాను చూపించింది. బాహుబలి సినిమాతో టాలీవుడ్ సత్తా ఏమిటో రుచి చూపించిన వ్యక్తి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. జక్కన్న చెక్కిన ఈ బాహుబలి శిల్పం సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా రికార్డులను కొల్లగొట్టాలని ఎందరో ప్రయత్నిస్తున్నారు.

అయితే జక్కన్న చెక్కిన ఈ శిల్పంను దాటుకొని ముందుకు పోవాలంటే ఏమి చేయాలని లెక్కలు వేసుకోవడం సరిపోతుంది టాలీవుడ్ టాప్ దర్శకులకు, హీరోలకు. ఈ సినిమాల రికార్డును తిరగరాయాలంటే కేవలం ముగ్గురు త్రిమూర్తుల వల్లనే అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పుడు సాహో రూపంలో వస్తున్న సినిమా బాహుబలి రికార్డును అందుకుంటుందా అనేది చూడాల్సిందే మరి. ఎందుకుంటే బాహుబలి సినిమా తరువాత యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. ఈ సినిమాపై సిని పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే సాహోతో పాటుగా బాహుబలి రికార్డును చేరుకునే సత్తా మళ్ళీ దర్శకధీరుడు రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపైనే అందరి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ టాప్ హీరోలు మెగా పవర్స్టార్ రామ్చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా కనుక బాహుబలి రికార్డును సాధించలేకపోతే ఇక త్రిమూర్తులు రంగంలోకి దిగాల్సిందేనట. త్రిమూర్తులు అంటే పవర్స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్బాబులను మల్టీస్టారర్గా పెట్టి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను రూపొందిస్తే అది సాధ్యమే అంటున్నాయి ఫిలిం వర్గాలు. సో ఇది సాధ్యమయ్యేదేనా అనే అనుమానం వ్యక్తం అవుతుంది.

Share.