టాప్ హీరో కుమార్తె ప్రియుడు మృతి చెందడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూతురు త్రిషాల దత్ ప్రియుడు మరణించాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో పాటు విషాదమైన పోస్టు కూడా పెట్టారు. నా గుండె పగిలిపోయింది.. నన్ను ఎంతో ప్రేమించావు… నా గురించి ఎంతో శ్రద్ధ వహించావు.. నా జీవితంలో ఎన్నడూ పొందనంత సంతోషాన్ని నువ్వు నాకు అందించావని పేర్కొంది.
అలాగే నీ ప్రేమను పొందిన కారణంగా ప్రపంచలోనే అదృష్టవంతురాలైన అమ్మాయినని భావించానని… మళ్లీ నిన్ను కలుసుకునేంత వరకు.. నిన్ను ఎంతగా మిస్సవుతానో నాకు మాత్రమే తెలుసు. ఎల్లప్పుడూ నీ దానినే.. నిన్నటి కంటే నేడు… నేటి కంటే రేపు నిన్ను ఎక్కువుగా ప్రేమిస్తుంటానని త్రిషాల దత్ సోషల్ మీడియాలో ఆమె ఎమోషనల్ పోస్టు పెట్టారు.
ఈ పోస్టును బట్టి త్రిషాల ప్రియుడు మంగళవారం మృతిచెంది ఉంటాడని తెలుస్తోంది. సోషల్ మీడియాలో త్రిషాల చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన ఇటాలియన్ బాయ్‌ఫ్రెండ్ (మరణించిన వ్యక్తి)తో దిగే ఫొటోలను ఎక్కువుగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ సంఘటన తర్వాత నువ్వు మరింత ధైర్యంగా ఉండాలని ఆమెను అభిమానులు ఓదారుస్తున్నారు. ఇక త్రిషాల దత్ సంజయ్ మొదటి భార్య రిచా శర్మ కూతురన్న విషయం తెలిసిందే. కూతురితో సంజయ్‌కు పెద్దగా అనుబంధం లేదు.