ప్రముఖ నటి త్రిష, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఇద్దరు కలిసి పెట్ట అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నారు. విజయ్ సేతుపతి, నటి సిమ్రాన్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇక తాజాగా సినిమా షూటింగ్ లో భాగంగా నటి త్రిష, మరియు రజినీకాంత్ ఇతర యూనిట్ సభ్యులు కలిసి కాశి విశ్వనాథ్ గుడిని దర్శించుకున్నారు. అందులో భాగంగా త్రిష రజినీకాంత్ తో కలిసి ఉన్న ఫోటో ఒకటి షేర్ చేయగా ఆ ఫోటో కాస్త నెట్ లో వైరల్ గా మారింది. త్రిష ఈ ఫోటో షేర్ చేస్తూ దేవుడి లాంటి వ్యక్తి తో కలిసి ఇప్పుడే దర్శనం పూర్తి చేసుకుని వచ్చాం అని తెలిపారు. రజిని కాంత్ ని దేవుడని చెప్పటంతో అయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు.
త్రిష, విజయ్ సేతుపతి కలిసి నటించిన ప్రేమ కథ చిత్రం ” 96 ” ఇటీవలే విడుదలై అన్ని ప్రాంతాల్లో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో త్రిష నటనకి ప్రముఖుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది.