తీవ్ర అస్వస్థతతో.. హాస్పిటల్ కి చేరిన సిరివెన్నెల..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ఇండస్ట్రీ లోనే సినీ గేయ రచయితగా పేరు పొందారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈయన నిన్నటి రోజున తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో హుటాహుటిగా ఆయనను హైదరాబాదులో ఉండేటువంటి కిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు.కానీ రెండు రోజుల కిందట ఆయన అస్వస్థతకు గురైనట్లు కూడా సమాచారం.

ఇక సీతరామశాస్త్రి విషయానికి వస్తే . ఈయన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఉండే అనకాపల్లి లో జన్మించారు. ఈయన 1955 మే 20 వ తేదీన జన్మించారు. తండ్రి శ్రీయోగి, తల్లి శ్రీమతి సుబ్బలక్ష్మి అమ్మ కి జన్మించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి MA చదువుకుంటున్న అప్పుడే సినిమా అవకాశాలు రావడంతో సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు.

మొదటిగా డైరెక్టర్ విశ్వనాధ్ తెరకెక్కించిన”సిరివెన్నెల” అనే సినిమాలో పాటలు రాసే అవకాశం దక్కించుకున్నాడు సీతారామశాస్త్రి. ఈ సినిమాలో . అవకాశం రావడంతో తన అనుభవాన్ని అంతా ఉపయోగించుకొని తన టాలెంట్ నిరూపించుకున్నడు సీతారామశాస్త్రి. ఇక ఈ మూవీతోనే ఈయన పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిపోయింది.ఇక 3000 వేలకు పైగా పాటలు రచనలు రాశారు.

Share.