ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తీవ్ర అస్వస్థతకు గురైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. వరుసగా కడప , తిరుపతి వంటి ప్రదేశాలలో ఆదివారం నాడు పర్యటించిన సమంత తీవ్రమైన జలుబు, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స కోసం చేరినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె నిన్న కడప లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం అక్కడికి వెళ్ళింది. అయితే ఆమె షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వస్తుందని తెలుసుకున్న అక్కడి స్థానికులు, అభిమానులు పెద్ద ఎత్తున గుంపులుగా వచ్చారు. ఇక అంతే కాదు సమంత కోసం వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడం షాపింగ్ మాల్ సిబ్బందికి , పోలీసులకు ఇబ్బందిగా మారిందట.
ఇకపోతే ఆమె ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరవడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. తర్వాత కడప లో ఉన్న అతి పెద్ద దర్గాను సందర్శించి చాదర్ ను సమర్పించింది. ప్రస్తుతం ఒమిక్రాన్ ఎక్కువ అవుతున్న తరుణంలో సమంత ఇలా అనారోగ్యం పాలవడం ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.