ఒకప్పుడు సినిమాలు విడుదలవుతున్నాయి అంటే ఎలాంటి హడావిడి లేకుండా మంచి విజయాలను అందుకుంటు ఉండేవి. ఏ భాషలో విడుదలైనా సరే జాతీయస్థాయిలో డబ్బింగ్ జరిగేవి ఇలా అన్ని భాషలలో వాటికి మంచి క్రేజ్ వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు అంటూ తెరకెక్కిస్తూ ఏ హడావిడి లేకుండా భారీ హిట్స్ కొట్టేవి చాలా తక్కువ అని చెప్పవచ్చు. అలా గతంలో ఎలాంటి హడావిడి లేకుండా సూపర్ హిట్ అందుకున్న చిత్రాలలో క్షత్రియ పుత్రుడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా దాదాపుగా ఆరు భాషలలో విడుదల చేయగా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ చిత్రంలో కమల్ హాసన్, రేవతి, గౌతమి లాంటివారు నటించారు. ఈ చిత్రం మొదట తమిళంలో తేవర మగన్ అనే పేరుతో విడుదల చేయడం జరిగింది అక్కడ సూపర్ హిట్ కావడంతో తెలుగులో క్షత్రియ పుత్రుడు అనే పేరుతో విడుదల చేశారు.ఇక్కడ కూడా మంచి హిట్ కావడంతో ఈ చిత్రాన్ని అనిల్ కపూర్ రీమేక్ చేయాలనుకున్నారు. అలా ఈ చిత్రాన్ని విరాశత్ అనే పేరుతో బాలీవుడ్ లో విడుదల చేశారు.
అలా అనిల్ కపూర్ కు 1997లో ఈ చిత్రం ఒక మైలు రాయిగా నిలిచింది. తెలుగు తమిళ్ వంటి భాషలలోనే కాకుండా దక్షిణాదిన పలు భాషలలో కంటే హిందీలో ఈ సినిమాకు మంచి క్రేజీ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా 16 విభాగాలలో ఫిలింఫేర్ అవార్డు కోసం నామినేట్ కావడం గమనార్హం. దీంతో ఈ సినిమా హిట్ ఏ రేంజ్ లో అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదు నేషనల్ అవార్డుని ఈ సినిమా తెలుగులో సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికీ బుల్లితెరపై ప్రసారమైంది అంటే చాలు కమల్ అభిమానులు చూస్తూనే ఉంటారు.
విలక్షణమైన నటుడుగా పేరుపొందిన కమలహాసన్ ఈ వయసులో కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. రీసెంట్గా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కమలహాసన్ కొన్ని కోట్ల రూపాయల లాభాన్ని పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.