ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన మొదట్లో ఎంతో మంది సినీ నటులు రాజకీయంగా కూడా ఎదగాలని పలు ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే కొంతమంది రాజకీయాల్లోకి వచ్చి అలా వెళ్ళిపోయారు.కానీ ఎన్టీఆర్ మాత్రం తెలుగుదేశం పార్టీ స్థాపించి రాజకీయాలలోకి వచ్చి తెలుగు నటులను చాలామందిని తీసుకువచ్చినట్లు అప్పట్లో ఎంతో మంది తెలియజేశారు. అలా వచ్చిన వారిలోనే కైకాల సత్యనారాయణ కూడా ఒకరు. అలా రాజకీయాల్లో రావడమే కాకుండా ఏకంగా ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
కైకాల జీవితంలో సినిమా రాజకీయాలు ఇలా అన్నీ ఉన్నాయి. ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చిన కొత్తలో కైకాల ఎంపీ అవ్వలేదు. అయితే అయ్యింది మాత్రం తెలుగుదేశం నుండే 1996 ప్రత్యక్ష రాజకీయాలలో కైకాల పోటీ చేశారు. 1996లో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం లో పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు ఆయన ఎన్నికలలో పోటీ చేయలేదు. దాదాపుగా 700కు పైగా సినిమాలలో నటించారు ఈయన.
ఇలా 200 మందికి పైగా దర్శకులతో పనిచేశారు కైకాల. ఇక రమా ఫిలింస్ అనే పేరిట ఒక చిత్ర నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి.. అందులో పలు సినిమాలను కూడా నిర్మించారు. ఈ క్రమంలోనే కొన్ని చిత్రాలకు చిరంజీవి సహనిర్మాతగా కూడా వ్యవహరించడం గమనార్హం. అలా కేజిఎఫ్ సినిమాకు కూడా కైకాల సత్యనారాయణ సమర్పకుడిగా వ్యవహరించారు. Kgf -1 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన హాజరయ్యారు కూడా ఆ తర్వాత పెద్దగా పబ్లిక్ లో ఎక్కడ కనిపించలేదు.. కైకాల బిరుదులు విషయానికి వస్తే అభిమానులు కల సంస్థలు సత్యనారాయణకు నటనకు చాలా బిరుదులు ఇచ్చారు ముఖ్యంగా నటసార్వభౌమ, కళా ప్రపూర్ణ ఇలా ఎన్నో బిరుదులు ఇచ్చారు.