టాలీవుడ్లో స్టార్ యాంకర్ గా ఒక గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ అనసూయ.సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్ట్ షేర్ చేసిన క్షణాలలోని వైరల్ గా మారుతూ ఉంటుంది. జబర్దస్త్ షోకు అనసూయ గుడ్ బై చెప్పడంతో ఆమె అభిమానులు కూడా చాలామంది బాధపడడం జరిగింది. విపరీతమైన అగౌరవమైన టీఆర్పి స్టంట్ల వల్లే తాను జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పానని అనసూయ పరోక్షంగా కామెంట్లు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో అనసూయ తిరిగి జబర్దస్త్ రీ ఎంట్రీ ఇవ్వడం కష్టమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సౌమ్యరావు ఈ షో కి కొత్త యాంకర్ గా కొనసాగుతోంది. సౌమ్యరాకు కూడా రెమ్యూనరేషన్ అంతంతకు పెరిగిపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. టీవీ షోలకు అనసూయ దూరమైన ఆమె ఈవెంట్లకు పనిచేసే ఛాన్స్ దక్కడంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులలో కూడా నటిస్తూ వస్తోంది. రెమ్యూనరేషన్ కూడా రోజుకి లక్ష రూపాయల రేంజ్ లో అందుకుంటోంది అనసూయ. నటించిన సినిమాలలో ఎక్కువగా సినిమాలు సక్సెస్ సాధించినవి ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో అనసూయ విలన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరి రాబోయే రోజుల్లో అనసూయ ఎలాంటి క్రేజీ ప్రాజెక్టులను ఎంచుకొని ముందుకు వెళుతుందో చూడాలి మరి. ఇక సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ గా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంటోంది. అనసూయ కెరియర్ విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం అనసూయ వయసు పెరుగుతున్న ఆమె అందం మాత్రం అసలు తగ్గలేదని చెప్పవచ్చు. ఇక అనసూయ సినిమాల ప్లానింగ్ విషయంలో చాలా క్లారిటీగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.