ధోని ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మొదటి చిత్రం ఇదే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే టీమ్ ఇండియా ప్లేయర్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్గా భారత్ కు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన ధోని కోట్లాది అభిమానులను సంపాదించారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నారు. అలాగే పలు వ్యాపారాలకు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నెలల కిందట ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ ని కూడా నిర్మించారు.

MS Dhoni turns producer, announces title of maiden Tamil film starring  Harish Kalyan and Ivana : Bollywood News - Bollywood Hungama

ధోని తాజాగా తన మొదటి సినిమాలు ప్రకటించాడు లేటెస్ట్ గా మ్యారీడ్ అంటూ ఒక గ్లింపును కూడా విడుదల చేశారు. ఈ క్రేజీ మూవీ లో హరి కళ్యాణ్ ఇనావా.. సీనియర్ నటి నదియా ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగిబాబు తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లుగా ఈ గ్లింప్స్ లో చూపించారు. ఈ చిత్రాన్ని రమేష్ తమిళమని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. మరి కొన్ని వివరాలు త్వరలోనే తెలియబోతున్నాయి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రొడక్షన్ హౌస్ ఆయన భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వహించనుంది .మొదటి సినిమా ఆమె కథ సహకారం కూడా అందించినట్లు గతంలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత సౌత్లో వరుస సినిమాలను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ నేను సాక్షి రాసిన కథను చదివినప్పుడు చాలా స్పెషల్గా అనిపించింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీర్చిదిద్దేందుకు సాయి శక్తుల ప్రయత్నిస్తానని తెలియజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. మరి దీంతో ధోని సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.

Share.