కేటిఆర్ ఉపాసనని ఎలా పిలిచారో చూడండి..

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ఐటి శాఖ మంత్రి శ్రీ కేటిఆర్ గారి జన్మదినం సందర్భంగా నిన్న ట్విట్టర్ లో ఆయనకి పలువురు ప్రముఖులు బర్త్ డే విషెస్ చెప్పారు. అందులో కొణిదెల ఉపాసన కూడా ఒకరు, ఉపాసన నిన్న ట్విట్టర్ వేదికగా శ్రీ కేటిఆర్ గారికి బర్త్ డే విషెస్ చెప్పగా..దానికి బదులుగా కేటిఆర్ థాంక్స్ ‘ఉప్సి’ అండ్ చరణ్, ఇప్పుడే మీ ఫ్లవర్స్ మరియు విషెస్ అందుకున్న అని రిప్లై చేసారు.

అయితే కేటిఆర్ ఉపాసనని ‘ఉప్సి’ అని పిలవటం తో నెటిజన్స్ ఆశ్చర్య పోయారు. గతంలో కేటిఆర్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ఆడియో ఫంక్షన్స్ కి ముఖ్య అతిధిగా వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది..అయితే అదే స్నేహం కేటిఆర్ మరియు ఉపాసనల మధ్య కూడా ఉందని ఈ ట్వీట్ తో అర్ధం అవుతుంది. అయితే కేటిఆర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకా సుమారు పన్నెండు వందల మంది నెటిజన్స్ ఆ ట్వీట్ ని లైక్ చేయటం మరో విశేషం.

Share.