నందమూరి హీరోలలో ఒకరైన తారకరత్న ప్రస్తుతం హార్ట్ ఎటాక్ తో బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైద్యులు తారకరత్నకు ఎస్మో చికిత్స చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం కాస్త విషయంగానే ఉందని విషయం తెలియగానే అభిమానులు కాస్త ఆందోళనలకు గురవుతున్నారు. నందమూరి మోహన్ కృష్ణ కుమారుడు అయిన తారకరత్న మొదటిసారి ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకున్న నటుడుగా తారకరత్నకు మంచి పేరును తెచ్చిపెట్టింది.
తారకరత్న పేరుపై ఒక అరుదైన రికార్డు కూడా ఉంది. ఈ రికార్డును రాబోయే రోజుల్లో ఎవరు బ్రేక్ చేయడం సాధ్యం కాదని చెప్పవచ్చు.. హీరోగా ఒకే సమయంలో 9 సినిమాలతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంటే అది ఆశామాసి విషయం కాదు.ఈ సినిమాలలో కొన్ని సినిమాలు విడుదలై మరికొన్ని సినిమాలు విడుదల కాలేదు. ఈ రికార్డును మాత్రం సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. చిన్న వయసులోనే తారకరాత్న సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వగా జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా ఈ హీరో సినిమాలలోకి వచ్చారని ప్రచారం అప్పట్లో ఎక్కువగా జరిగింది.
బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ లక్కు లేకపోవడంతో తారకరత్న కెరియర్ చాలా ఇబ్బందులలో పడిపోయింది. తారకరత్న నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా క్లారిటీ లేదు. తారకరత్న కూడా సినిమాల పైన ప్రస్తుతం ఆసక్తి తగ్గిపోయిందని తెలుస్తోంది. అందుచేతనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూడగా ఇలా ఇచ్చిన సమయంలోనే తారకరత్నకు హార్ట్ ఎటాక్ రావడం జరిగింది ప్రస్తుతం ఈయన వయసు 39 సంవత్సరాలు. తారకరత్న ఆరోగ్యంగానే కోలుకొని బయటికి రావాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.