వరదల నుండి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రాంతాలు ఉపశమనం పొందుతున్నాయి. అయితే తాజాగా తిరుపతి నగర ప్రజలకు ఎదురవుతున్న వింత వింత సమస్యలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వరద కారణంగా భూమి కుంభ డంతో ఎప్పుడు జరుగుతోందని జనం భయపడుతున్నారు.
తిరుపతి లో ఉన్న శ్రీ నగర్ కాలనీ లో నిన్నటి రోజున 18 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ఒక భవన కొరకడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అదే శ్రీనగర్ లో ఉన్న ఓ భవనం భూమిలోకి కనిపించింది దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరిషా పరిశీలించి, భూమిలోకి కనిపించిన ఆ భవనాన్ని కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ భవనానికి చుట్టుపక్కల ఉన్న నివాసితుల ను కూడా ఇళ్ళల్లో నుండి ఖాళీ చేయించింది.
బాధితులు తమ ఇల్లు కూల్చేందుకు ఒప్పుకోమని అధికారులకు వెల్లడించారు. నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పినప్పటికీ బాధితులు ఒప్పుకోవడం లేదు. దీంతో అధికారులు బలవంతంగా ఇంటిని ముందస్తు చర్యల్లో భాగంగా కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ శ్రీనగర్ ప్రాంతమంతా గత 50 సంవత్సరాల నుండి స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం కావడంతో, కొద్ది రోజులుగా వర్షాలు కురవడంతో ఆ ప్రాంతమంతా పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతోనే ఈ పరిణామాలన్నీ చోటుచేసుకుంటున్నాయని అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు.