తిరుపతిలో వర్షాలపై చిరు సంచలన వ్యాఖ్యలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, భక్తులు మరియు స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తమ మనస్సును కలిచివేశాయని తెలియజేశారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం.. తిరుమల తిరుపతి దేవస్థానం కలిసికట్టుగా కృషి చేసి, సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి అన్నారు.అన్ని రాజకీయ పక్షాలు, తమ అభిమాన సంఘాలు సైతం, చేయూతనివ్వాలని కోరుతున్నాం అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తమ వంతు సహాయంగా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు.

ఇక మెగాస్టార్ తాజాగా ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి నటించడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్లు గా పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా రామ్ చరణ్ వహించాడు.

Share.