ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లో ఉన్నటువంటి కలియుగ దైవం తిరుమల తిరుపతి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కొద్ది రోజుల క్రితం వర్షంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది తిరుపతి. తాజాగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సర్వదర్శన టికెట్లు విడుదల అయ్యాయి. ఇప్పటికే నవంబర్ నెలకు సంబంధించిన టికెట్లు హాట్ కేకులా అమ్ముడు పోయిన విషయం విధితమే. డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లను టీటీడీ వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు అందుబాటులోకి రావడంతో టికెట్లు భక్తులు నిమిషాలలో బుకింగ్ చేసుకున్నారు.
అయితే ఇవాళ సర్వదర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చిన టీటీడీ రేపు ఆదివారం తిరుమల వసతికి సంబంధించిన టోకెన్లను విడుదల చేయనున్నది. కరోనా మహమ్మారి విజృంబించినప్పటి నుంచి ముఖ్యంగా తిరుమలలో దర్శన టోకెన్లను అన్ని రకాలుగా ఆన్‌లైన్‌లోనే ఉంచుతున్నది. గత 2 నెలల కాలం నుంచి సర్వదర్శనం టోకెన్లను కూడా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచుతొంది ttd.ఈ విషయాన్ని గమనంలో పెట్టుకుని శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు ముందస్తుగానే టోకెన్లు, వసతి బుక్ చేసుకోవానలి కోరుతుంది టీటీడీ. ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తోంది టిటిడి.