కన్నడ పవర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన ఈయన అనుకోకుండా చిన్న వయసులోనే గుండెపోటు వచ్చి మరణించడం యావత్ సినీ ప్రపంచాన్ని కలిచివేసింది. ముఖ్యంగా పునీత్ రాజకుమార్ అంటే కన్నడ ప్రజలు ప్రాణం ఇస్తారు. ఒక్క రూపాయి ఇచ్చేవాడు కూడా అందరికీ తెలిసేలా..అందరూ చూసేలా ఇస్తాడు.. అయితే కుడి చేతితో దానం చేసిన విషయం ఎడమ చేతి కూడా తెలియకూడదు అనే సామెతకు అక్షరాల నిదర్శనం పునీత్ రాజకుమార్. అంతేకాదు ఆయన చనిపోయే వరకు కూడా తెలియదు.. ఆయన ఎంతమందిని ఆదుకున్నారో.. ఎంతమందికి దానాలు చేశారో.. అయితే ఇవన్నీ తెలిసిన తర్వాత ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఒక్క కట్టుకున్న భార్యకు తప్ప అటు బిడ్డలకు , ఇటు అభిమానులకు, కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా చాలా సంవత్సరాల పాటు గుప్త దానాలు చేశారు పునీత్ రాజ్ కుమార్. ఆయన మరణం తర్వాత ఒక్కొక్కటిగా ఆయన దాన ధర్మాల గురించి బయటకి వస్తుంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇక అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు (మార్చ్ 17).. అభిమానుల మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ కుటుంబ సభ్యుల మీద కూడా పునీత్ రాజ్ కుమార్ కి ఉంది.
పునీత్ రాజకుమార్ అంటే ఒక బ్రాండ్ అనే స్థాయికి ఎదిగిపోయారు. ఈయన ఎవరో కాదు కన్నడ ఇండస్ట్రీకి చెందిన డాక్టర్ రాజ్ కుమార్ ముద్దుల కొడుకు.. పుట్టుకతోనే డబ్బు.. హోదా .. తండ్రి పెద్ద స్టార్ హీరో.. అయిన ఆయన చాలా సింపుల్ గానే బ్రతికారు. ఎప్పుడూ కూడా తాను ఒక పెద్ద స్టార్ హీరో కొడుకును, అన్న హట్రిక్ హీరో , నేను పెద్ద హీరో అని ఏ రోజు గర్వపడలేదు. శ్రీమంతుడైనా సరే సామాన్యుడిలా బ్రతికాడు. పునీత్ రాజ్ కుమార్ చేసిన దానధర్మాల గురించి వెలుగు చూడడంతో తర్వాత చాలామంది కోటీశ్వరులు వారి డబ్బుల్లో కొంచెం అనాధలకు ఇవ్వడానికి ముందుకు రావడం ఆయన అభిమానులు సంతోషించారు.