బాలీవుడ్, టాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ కృతి ససన్.. మొదట మహేష్ నటించిన నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ..ఆ తర్వాత నాగచైతన్యతో దోచేసి సినిమాలో నటించి పెద్దగా అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. సౌత్ ఇండియాలో పాగ వేయాలనుకున్న కృతి ససన్ కు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.
ఇక ప్రభాస్ తో కలిసి రీసెంట్గా అది పురుష్ చిత్రంలో నటించింది. దీంతో తనకు తిరుగులేదని భావించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ అమ్మడు పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.. కానీ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి ససన్ బాలీవుడ్ లో తనకు ఎదురైన బాడీ షేమింగేస్ పైన కామెంట్లు చేయడం జరిగింది..కృతి ససన్ మాట్లాడుతూ తను మోడల్గా చేసి సిని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
అయితే బాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండగా కొంతమందికి తనకు చెత్త సలహాలు ఇచ్చారని తన ముక్కు సరిగ్గా లేదని బాగా ఎర్రగా ఉందంటూ చెప్పి తన పెదాలు కూడా బాగాలేవంటూ వాటిని సర్జరీ చేయించుకోమంటూ సలహాలు ఇచ్చారట అప్పుడే తనకు హీరోయిన్గా అవకాశాలు వస్తాయని తెలియజేశారని తెలియజేస్తోంది కృతి ససన్.. కానీ ఈ విషయాలన్నీ విన్న తర్వాత తనకు చాలా బాధేసింది అని తెలియజేసింది.
కానీ వారు చెప్పిన వాటన్నిటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లాలని దీంతో తన డేడికేషన్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానట్టు తెలియజేస్తోంది కృతి ససన్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది.