సినిమాలు తీయకపోయినా టాప్ లో ఉన్న హీరోయిన్స్ వీళ్ళే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు స్టార్ హీరోయిన్స్ జాబితాను ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్ విడుదల చేసింది. 2022లో వచ్చిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులు అత్యధికంగా అభిమానించిన హీరోయిన్స్ జాబితాలను విడుదల చేయడం జరిగింది. ఓర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ జాబితాను విడుదల చేసింది. అందులో నెంబర్ వన్ స్థానంలో సమంత నిలిచింది. సమంత యశోద సినిమాతో వచ్చింది. ఆ తరువాత రెండవ స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచింది. మూడవ స్థానంలో అనుష్క నిలిచింది. ఈ ముగ్గురు కూడా గత ఏడాది పెద్దగా సినిమాలు చేయలేదు. ఒక్క సమంత మాత్రమే యశోద సినిమా చేసింది.

Image

ఇక కాజల్ అగర్వాల్ ఈమె 2022లో అసలు సినిమాలే చేయలేదు. పెళ్లి చేసుకొని తల్లి అవ్వడం వల్ల కాజల్ అగర్వాల్ ఒక్క సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయింది. అనుష్క సంగతి మనందరికీ తెలిసిందే.. ఈమధ్య అసలు ఆమె కనిపించటమే లేదు. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు కూడా కనిపించలేదు. కనీసం ఆమె కొత్త సినిమా అప్డేట్స్ ఇవ్వలేదు. అయినా కూడా ఈ జాబితాలో మూడో నెంబర్ స్థానంలో నిలవడం అంటే గొప్ప విశేషం.

మూడో స్థానంలో ఎలా వచ్చింది అనుష్క అంటూ ప్రేక్షకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రముఖ్యంగా జరుగుతున్న అనుష్క పెళ్లి మరియు ఆమె ఇతర విషయాల గురించి చర్చ వల్లే ఆమె మూడో స్థానంలో నిలిచింది. అనడంలో సందేహం లేదు. 2022లో తెగ హడావిడి చేసిన కృతి శెట్టి మరియు రష్మిక మందన వీరిద్దరూ ఐదవ స్థానంలో నిలిచారు. ఇక సాయి పల్లవి కూడా గత ఏడాది పెద్దగా సినిమాలు చేయకుండా ఈ జాబితాలో నెంబర్ ఫైవ్ స్థానంలో నిలిచింది. ఇక మన హాట్ బ్యూటీ పుట్ట బొమ్మ పూజ హెగ్డే నాలుగో స్థానంలో నిలిచింది. సినిమాలు తీసిన తీయకపోయినా వాటితో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ ప్రకారమే ఈ నెంబర్లను సూచించినట్లు ఓర్మాక్స్ సంస్థ తెలియజేసింది.

Share.