టాలీవుడ్ హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న తరుణ్ అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తరుణ్ తో సినిమాలు చేయడానికి నలుగురు స్టార్ హీరోయిన్స్ సైతం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వారట. వారి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
హీరో తరుణ్ మొదట నువ్వే కావాలి సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇవ్వగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా ఈ సినిమా ఎక్కువ సెంటర్లలో 500 రోజులు ఆడింది. ఆ తర్వాత ప్రియమైన నీకు ,నువ్వు లేక నేను లేను ,నువ్వే నువ్వే వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించిన తరుణ్ తన క్రేజ్ పూర్తిగా మారిపోయింది. దీంతో దర్శక నిర్మాతలు తరుణ్ డేట్ల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూసేవారు.
అయితే తన కెరియర్లో చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఒక్కసారిగా కెరియర్ తలకిందులైంది. అప్పట్లో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఉంటే కెరియర్ ఒక రేంజ్ లో ఉండేది. నీ మనసు నాకు తెలుసు సినిమాలో త్రిష, ఇటు ఆర్తి అగర్వాల్, శ్రేయ ,ప్రియమణి వంటి హీరోయిన్లు కూడా తరుణ్ పక్కన నటించారు.
తరుణ్ కుర్ర హీరో అయినప్పటికీ కూడా తరుణ్ తో నటించేందుకు ఎక్కువ మక్కువ చూపించే వారట. తరుణ్ స్టార్ హీరోయిన్ తో నటించి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు.ప్రస్తుతం హీరోయిన్ త్రిష ప్రియమణి మాత్రం ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు. ఇటీవల శ్రేయ ఒక బిడ్డకు కూడా తల్లి అయింది ప్రియమణి వెబ్ సిరీస్ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ నలుగురు హీరోయిన్స్ తరుణ్ తో ఎక్కువగా నటించేందుకు ఇష్టపడే వారట.