ఈ కొత్త ఏడాది ప్రేక్షకులను అలరించబోతున్న కొత్త హీరోయిన్లు వీళ్లే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రతి సంవత్సరం ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. అయితే ఈ ఏడాది మాత్రం చాలా మంది కొత్త హీరోయిన్లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ ఏడాది ప్రేక్షకులను అలరించబోతున్న ఆ కొత్త హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ముఖ్యంగా తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియా భవాని శంకర్ మొదటిసారి తెలుగులో కళ్యాణం కమనీయం సినిమాతో అడుగుపెట్టింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయాన్ని సాధించలేదు. కానీ ప్రియా భవాని శంకర్ కి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే ఈమె సత్యదేవ్ సినిమాలో నటించడంతోపాటు నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ దూత, లారెన్స్ సినిమా రుద్రుడులో కూడా ఈమె నటిస్తోంది.

మరోవైపు జనవరి 26న రాబోతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ మూవీ బుట్ట బొమ్మతో చైల్డ్ ఆర్టిస్ట్ అనికా సురేంద్ర తెలుగు వారి ముందుకు తొలిసారి హీరోయిన్గా రాబోతోంది. గత యేడాది విడుదలైన నాగార్జున గోస్ట్ సినిమాలో కూతురుగా నటించి మెప్పించింది. ఇంకొక వైపు ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కాబోతున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో ఆషికారంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అలాగే మూవీ మొగల్ డి. రామానాయుడు మనవడు అభిరామ్ దగ్గుపాటి హీరోగా వస్తున్న అహింస సినిమాతో గీతికా తివారి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

ఇకపోతే సినిమా పేరులో అహింస ఉన్నా సినిమాలో చాలా హింస ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. గత ఏడాది స్వాతిముత్యంతో డీసెంట్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి గణేష్ రెండవ సినిమా నేను స్టూడెంట్ సర్. ఈ సినిమాతో బాలీవుడ్ భామ అవంతిక దుస్సాని తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈమె అలనాటి నటి భాగ్యశ్రీ కుమార్తె కావడం గమనార్హం. మరొకవైపు బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య, శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో గౌరీ జి కిషన్ తో పాటు మరికొంతమంది హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు.

Share.