సినీ ఇండస్ట్రీలో హీరోలదె పై చెయ్యి అనడంలో ఎలాంటి సందేహం లేదు థియేటర్లోకి ప్రేక్షకులను రప్పించడం కేవలం కొంతమంది హీరోలకి మాత్రమే సాధ్యమవుతుంది. అలా కొంతమంది దర్శకులు కూడా హీరో హీరోయిన్లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలరు. ఇక హీరోయిన్స్ కూడా కొంతమంది స్టార్ కాస్ట్ లేకున్నప్పటికీ ఆడియన్స్ థియేటర్లో రప్పించగలిగే సత్తా ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
సౌత్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న అనుష్క శెట్టి లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు. అరుంధతి సినిమాతో అనుష్క స్టార్డం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ కూడా ఆమె ఫేస్ వాల్యూ తోనే మంచి సక్సెస్ అవుతున్నాయి. మరొక హీరోయిన్ అటు కోలీవుడ్ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార కూడా పలు లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది. తన సినిమాలతో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలిగే సత్తా ఈమెకు కూడా ఉందని చెప్పవచ్చు. ఈ మధ్యనే వివాహ బంధంలోకి అడుగుపెట్టి సినిమాలలో కూడా నటిస్తోంది.
ఇక మరొక హీరోయిన్ సమంత పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి బాగానే సక్సెస్ అవుతోంది ఈమధ్య పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న కారణంగా సినిమాలు కాస్త తగ్గించిన సమంత మళ్ళీ పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నారు. ఇక తర్వాత లిస్టులో కీర్తి సురేష్ ఉన్నది ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నప్పటికీ ఈమె ఎంచుకునే కథలు విషయంలో దర్శకులు విషయంలో సరిగ్గా లేక విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. ఇక తమన్నా నటించిన పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక వేరే కాకుండా మరి కొంతమంది ఉన్నారు.