రష్మిక రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే ఒక హీరో చేయవలసిన పాత్ర ఇతర హీరోల దగ్గరకు వెళుతూ ఉంటాయి.అలా హీరోయిన్స్ విషయంలో కూడా జరుగుతూ ఉండడం సర్వసాధారణం. ఒక్కొక్కసారి ఆ పాత్రను మిస్ చేసుకున్న వారు ఆ పాత్ర సక్సెస్ అయ్యిందంటే చాలు ఎన్నో సందర్భాలలో బాధపడుతూ ఉంటారు. అలా తెలుగులో పాటు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న హీరోయిన్ రష్మిక తన కెరియర్లో ఎన్ని చిత్రాలను వదులుకుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Rashmika Mandanna removed from Kannada film industry? Actress reacts

1). ఆచార్య
ఈ ఏడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆచార్య మూవీలో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం రష్మికాని అడిగారట. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో మరో కారణంతో ఈ సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది.

2). కిరిక్ పార్టీ:
కన్నడలో సక్సెస్ అయిన ఈ చిత్రాన్ని హిందీలో కార్తీక్ ఆర్యంతో రీమిక్స్ చేయాలనుకున్నారు. ఇందులో హీరోయిన్గా రష్మిక అనుకోగా ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకున్నట్లు సమాచారం.

3). జెర్సీ:
తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం హిందీలో ఇదే టైటిల్ తో షాహిద్ కపూర్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మి కానే అనుకోగా ఇందులో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

4). మాస్టర్:
తమిళ హీరో విజయ్ దళపతి, డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్గా రష్మిక అనుకోగా తన పాత్ర చాలా తక్కువగా ఉండడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు.

5). బీస్ట్:
విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం రష్మిక సంప్రదించగా కథ నచ్చకపోవడంతో ఈ సినిమాని ఒప్పుకోలేదట.

6). అంటే సుందరానికి:
నాని హీరోగా, నజ్రియా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్గా ముందుగా రష్మిక అనే అనుకున్నారట. కానీ రష్మిక ఈ సినిమా చేయాలని చెప్పడంతో నజ్రియాను తీసుకోవడం జరిగింది.

7). బంగార్రాజు:
నాగచైతన్య తన తండ్రి నాగార్జున కలిసి ఈ చిత్రంలో నటించారు. ఇందులో హీరోయిన్ కోసం రష్మి కాను సంప్రదించగా ఈమె ఈ సినిమాలో నటించాలని ఉందట.

ఇవే కాకుండా ఆర్సి15లో పాటు, మహాసముద్రం, పలు బాలీవుడ్ ప్రాజెక్టులకు కూడా నో చెప్పినట్లు సమాచారం.

Share.