ఒక సినిమా తీయాలంటే దాని వెనక ఎంతో కష్టం కృషి ఉంటుంది. డైరెక్టర్ అయితే కథ కథనం ఎలా ఉంది అనే విషయం మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు. ఎందుకంటే ఏది ఎలా ఉన్నా పర్లేదు కానీ కథ మాత్రం బాగుండాలి. అందుకే డైరెక్టర్ ఎక్కువగా మొత్తం సినిమాకి సంబంధించిన వర్క్ ముందే ప్లాన్ ప్రకారం కంప్లీట్ చేసి ఆ తరువాత షూట్ చేస్తారు. అయితే సినిమాలలో కొన్ని ఎలివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వాటివల్లే ప్రేక్షకులు ఎక్కువ త్రిల్ ఫీల్ అవుతాడు. మరి అలా సినిమాలలో ప్రేక్షకులను మెప్పించిన హీరో ఇంట్రడక్షన్ సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.
యోగి
ఈ సినిమాకి హీరో ప్రభాస్ డైరెక్టర్ వివి.వినాయక్ ఈ సినిమాలో ప్రభాస్ జైల్లో ఉంటే చాలామంది గుండాలందరూ వచ్చి ప్రభాస్ ను చూసి నా పేరు గుర్తు పెట్టుకో అన్నా అంటూ పేర్లు చెబుతూ ఉంటారు. అక్కడ జరిగే చిన్న ఫైట్ తోనే హీరో ఇంట్రడక్షన్ వస్తుంది.
చిరుత:
రామ్ చరణ్ మొట్టమొదటి సినిమా చిరుత. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ డైరెక్టర్ ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ ని పూరి జగన్నాథ్ చాలా అద్భుతంగా తీశారు. హీరోతో జైల్లో ఒక్కడు గొడవ పెట్టుకుంటే వాన్ని కొట్టే ప్రాసెస్లో ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని ఫైట్ చేస్తుంటే దాన్ని రౌడి పట్టుకొని లాగటంతో హీరో ఫేస్ రివిల్ అవుతుంది. అలా చరణ్ ని చూసిన మెగా ఫాన్స్ ఆనందానికి అవధులే లేవనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్:
పవన్ చాలా సినిమాల్లో నటించాడు. కానీ గబ్బర్ సింగ్ కి చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో రౌడీలు బ్యాగ్ రాబరి చేసుకుని వెళ్తుంటే హీరో గుర్రం మీద వచ్చి వాళ్లని పట్టుకొని మరీ రికవరీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా స్పెషల్ గా కనిపించారు.అలాగే పోకిరి, ఒక్కడు, టెంపర్, కేజిఎఫ్ వంటి చిత్రాలలో కూడా మంచి ఇంట్రడక్షన్ సీన్లు ఉన్నాయి.