ఇండస్ట్రీలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరుమో చెప్పలేము. ఒకప్పుడు సక్సెస్ లో ఉన్నవారు. ఇప్పుడు అవకాశాలు లేక సతమతమవుతున్నారు. అయితే అందం అభినయం ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక పోయిన హీరోయిన్గా పేరుపొందింది రిచా పనయ్.ఈమె అల్లరి నరేష్ తో మొదటి చిత్రం యముడికి మొగుడు సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఆమె అందంతోపాటు అమాయకత్వంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తరువాత చందమామ కథలు, రక్షక భటుడు లాంటి సినిమాల్లో నటించిన కూడా ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. ఆ తరువాత అవకాశాలు లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమైంది ఈ అమ్మడు
ఇదిలా ఉంటే రిచా పనమ్ కరోనా లాక్ డౌన్ ఎప్పుడు కనిపించింది.. మళ్ళీ ఇప్పుడు హైదరాబాదులో మెరిసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. లాక్డౌన్ సమయంలో నేను రెండు సినిమాలు చేశానని అవి ఎప్పుడు విడుదల అయితాయని ఎదురుచూస్తున్నాను. ఒకటి బృందావనమది అందరిదీ అనే సినిమాలో నటించాను. మరో సినిమా నీలకంఠ గారి దర్శకత్వంలో నటించాను. ఈ రెండు సినిమాలు విడుదలయితే నాకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నాను. నటించిన సినిమాలు నాకు ఒక మెమొరబుల్ గా మిగిలాయి. అయితే సినిమా అవకాశాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలీదు.. కాబట్టి నేను ప్లాన్ తో క్యాట్ కాఫీ స్టూడియోని స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ మంచి అవకాశాలు వస్తే మాత్రం సినిమాలలో తప్పకుండా నటిస్తానని తెలుపుతోంది.
ఒకప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని కానీ ఇప్పుడు ప్రస్తుతం అంత యాక్టివ్ గా ఉండటం లేదు. ఎందుకంటే అందులో నెగిటివ్ కామెంట్స్ బాగా వస్తున్నాయి. నేనైతే పెద్దగా కామెంట్స్ ని పట్టించుకోను.. మా అమ్మ మాత్రం అన్ని కామెంట్లు చదువుతూ ఉంటుంది. అని తెలిపింది రిచా పనయ్.