టాలీవుడ్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం చిత్రం తో ఎంట్రీ ఇచ్చాడు నటుడు రవి కిషన్. అందులో మద్దాలి శివారెడ్డి పాత్రలో అదరగొట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. భోజ్ పురిలో సీనియర్ నటుడైన రవికిషన్ తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ మధ్యనే కాస్టింగ్ కౌచ్ బాధితుడగా బిగ్ బాంబు పేల్చి ఇటీవల వార్తల్లో నిలిచాడు. అంతేకాకుండా బీజేపీ ఎంపీ గా వ్యవహరిస్తున్నాడు.
ఇకపోతే గతంలో సీనియర్ స్టార్ హీరోయిన్ నగ్మాతో నటుడు రవికిషన్ సీక్రెట్ ఎఫైర్ నడిపించాడనే టాక్ ప్రస్తుతం వైరల్ గా మారుతోంది… తాజాగా వీరిద్దరి గురించి ఒక షోలో పాల్గొన్న రవ కిషన్ కు ఈ వార్త ఎదురైంది. హోస్ట్ రవి కిషన్ కు నగ్మాతో మీకు ఎఫైర్ ఉండేదా..? అని ప్రశ్నించగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నేను నగ్మా తో బోలెడన్ని సినిమాలు తీశాను. అందువల్లే నాకు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. మేమిద్దరం మంచి స్నేహితులం అంతేకాకుండా మా సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లర్ సాధించాయి.
ఇక నాకు పెళ్లయిన సంగతి అందరికీ తెలుసు నా భార్య పేరు ప్రీతి శుక్ల నా భార్యను నేను ఎంతో ప్రేమిస్తాను గౌరవంగా చూసుకుంటాను నా దగ్గర డబ్బు లేనప్పుడు కూడా నా భార్య నాకు అండగా నిలిచి.. ముందుకు నడిపించింది. ప్రస్తుతం నా భార్యతో పిల్లలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మళ్లీ ఇలాంటి రూమర్స్ అన్ని తవ్వి మమ్మల్ని వార్తల్లో నిలబెట్టకండి అని రవి కిషన్ చెప్పుకొచ్చారు. దీంతో నగ్మా తో రూమర్ల విషయంపై క్లారిటీ ఇచ్చారు రవి కిషన్..