Puspa-2 చిత్రంలో ఆ స్టార్ విలన్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో పుష్ప -2 చిత్రాన్ని కూడా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడా ఇటీవలే పూర్తయింది. ఈ సినిమా నుంచి అప్డేట్ కావాలని అభిమానులు సైతం కొద్ది రోజుల నుంచి పలు ధర్నాలు కూడా చేశారు. చిత్ర బృందం మాత్రం ఈ విషయంపై ఏ విధంగా స్పందించలేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పుష్ప -2 లో మరొక నటుడు ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఆ నటుడు ఎవరో కాదు పలు సినిమాలలో విలన్ గా నటించిన జగపతిబాబు. పుష్ప -2 లో జగపతిబాబు కు మంచి పాత్ర రాసుకున్నట్లు సమాచారం. పుష్ప మొదటి భాగంలో ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. కానీ రెండవ భాగంలో ఫహద్ ఫాజిల్ తో పాటుగా మరొక బలమైన విలన్ గా ఉండాలని సునీల్ కి జతగా జగపతిబాబు కూడా దించబోతున్నట్లు సమాచారం. మొత్తానికి సుకుమార్ సినిమాలో జగపతిబాబు మరొకసారి మంచి పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పుష్ప-2 మీరు ఎంత ఊహించిన దానికంటే మించి ఉంటుందని చిత్ర బృందం తెలియజేస్తోంది.

Actor Jagapathi Babu turns 60- The New Indian Express

పుష్ప -2 సినిమా కోసం సుకుమార్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ కైనా విడుదల చేస్తారా లేదో అని అనుమానాలు అభిమానులు మొదలెత్తుతున్నాయి. ప్రస్తుతం పుష్ప -2 చిత్రానికి సంబంధించి జగపతిబాబు విషయం వైరల్ గా మారుతోంది. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Share.