టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు ఆలీ. దాదాపుగా తన సినీ కెరియర్లో ఇప్పటివరకు 1200 కు పైగా సినిమాలలో కమెడియన్ గా నటించారు. మరికొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించారు. తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశారు ఆలీ. ఆలీ ఉన్నాడంటే కచ్చితంగా సినిమాలను కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన అది మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల చిత్రంతో హీరోగా పేరు సంపాదించారు.
అయితే ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్గా సౌందర్యాన్ని ఎంపిక చేయడం జరిగిందట.అయితే సౌందర్య స్టార్ హీరోయిన్ అప్పట్లోనే వరుసగా సినిమాలు చేస్తూ ఉండేది. ఇక ఆలీతో నటించడానికి ఈమె పెద్దగా ఆసక్తి చూపించలేదట. సౌందర్యాన్ని కృష్ణారెడ్డి ఎంత ఒప్పించినా కూడా ఈ చిత్రం కోసం ఆమె ఒప్పుకోలేదట.ఆ సమయంలోనే కొత్త హీరోయిన్ తీసుకురావాలని కృష్ణారెడ్డి ఇంద్రజను తీసుకురావడం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత పెద్ద హిట్టుగా నిలిచింది ఆ సమయంలో సౌందర్య చాలా బాధపడినట్లుగా కృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆలీ పక్కన నటించలేకపోయినందుకు చాలా రోజులు బాధపడిందట ఆ విషయాన్ని సౌందర్య తండ్రి కృష్ణ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. దీంతో ఈమెతో శుభలగ్నం సినిమాలో ఆలీతో కలిసి చినుకు చినుకు అందెలతో పాటకు డాన్స్ వేయించారు కృష్ణారెడ్డి. సౌందర్య నాకు సొంత చెల్లెలు లాంటిది ఎంత స్టార్ అయినా ఆమెలో గర్వం అసలు ఉండేది కాదు ఆమె ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకునే వాడినని కృష్ణారెడ్డి తెలిపారు.