బాహుబలి సినిమా ఇండియా వైస్ గా విడుదలై ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ఈ చిత్రము. ఈ సినిమా వల్లే తెలుగు ప్రేక్షకులు కూడా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించడం మొదలుపెట్టారు. సౌత్ సినిమాలు నార్త్ సినిమాల కంటే ఏమాత్రం తక్కువ కాదని నిరూపించిన మొట్టమొదటి చిత్రం ఇదే అని చెప్పవచ్చు .అలాగే ఈ సినిమాతో ప్రభాస్ ఇండియా అనే టాప్ హీరోగా పేరు సంపాదించారు.
రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా లో బాహుబలి పాత్ర తర్వాత అంత కీలకమైన పాత్ర ఏదైనా ఉందంటే కట్టప్ప పాత్ర అని చెప్పవచ్చు. బాహుబలి పక్కన ఎంతో నమ్మకంగా ఉండే కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడు అలా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే పాయింట్‌ని హైలెట్ చేస్తూ మొదటి పార్టీకి ఎండింగ్ ఇచ్చారు డైరెక్టర్ రాజమౌళి. ఇక సెకండ్ పార్ట్ లో కట్టప్ప క్యారెక్టర్ కూడా చాలా కీలకమైందని చెప్పవచ్చు. అలా ఈ పాత్రకు అంత డిమాండ్ ఉంది కాబట్టి ఈ పాత్ర కోసం మొదట రాజమౌళి మలయాళ సూపర్ స్టార్ అయిన మమ్ముట్టిని అడిగారట.
కానీ ఆ క్యారెక్టర్ నచ్చకపోవడంతో మోహన్ లాల్ రిజెక్ట్ చేశారట. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్రకి చాలా పేరు వచ్చింది .దీంతో మోహన్ లాల్ ఈ పాత్ర చేస్తే ఇంకా హైలైట్ గా ఉండేదని ఆయన అభిమానులు భావించారు. ప్రస్తుతం రాజమౌళి తీరుస్తున్న చిత్రాలలో ఎలాంటి చిన్న పాత్రలు వచ్చిన వదులుకొని ఉద్దేశంలో చాలామంది ఆర్టిస్టులు లేదన్నట్లుగా తెలుస్తోంది.