తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు సోగ్గాడు గా ఒక వెలుగు వెలిగారు హీరో శోభన్ బాబు. ప్రేమ కథ చిత్రాలలో ఎన్నో నటించి ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అప్పట్లో ఆయన అందానికి ఎంతోమంది ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ హీరోకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేదని చెప్పవచ్చు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన శోభన్ బాబు అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయకుడుగా పేరు సంపాదించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈయన కాస్త వయసు పెరిగాక సినిమాలకు దూరమయ్యారు.
నటుడుగా శోభన్ బాబు ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ తెలుగు ప్రేక్షకులు తనను ఒక హీరోగాని గుర్తు పెట్టుకోవాలని తనను ఎప్పటికీ ఓ సోగ్గాడిగానే చూడాలని సహాయ నటుడి పాత్రలో నటించలేదు. 70 ఏళ్ల వయసులో 2008లో తుది శ్వాస విడిచారు శోభన్ బాబు అయితే స్టార్ హీరోగా వేరొక వెలుగు వెలిగిన శోభన్ బాబు కుటుంబం నుంచి మాత్రం ఇండస్ట్రీకి ఎవరూ రాలేదు. శోభన్ బాబు కుమారుడు అచ్చం హీరో లాగే ఉన్న కానీ చిత్ర పరిశ్రమలో మాత్రం అడుగు పెట్టలేదు.
అందుకు కారణం తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలని ఎంతోమంది శోభన్ బాబుని పోస్ట్ చేయగా అందుకు మాత్రం ఒప్పుకోలేదట. అప్పట్లో నటుడు రాజా రవీంద్ర శోభన్ బాబుని ఇదే ప్రశ్న వేయగా.. శోభన్ బాబు మాట్లాడుతూ.. తాను సినిమాలలోకి వచ్చిన కొత్తలో ఎంతో కష్టపడ్డానని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని సక్సెస్ అయినప్పటికీ చాలా ఒత్తిడికి గురయ్య వాడినని తెలిపారట.. నేను పడ్డ కష్టాలు నా పిల్లలు అసలు పడకూడదని ప్రతి సినిమాకు ముందు ఎంత సూపర్ స్టార్ అయిన టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్ పిల్లలకు వద్దని ప్రశాంతంగా బ్రతకాలని సినీ ఇండస్ట్రీకి వారిని దూరంగా ఉంచానని తెలిపారట.