టాలీవుడ్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో హీరోగా ఎన్నో చిత్రాలలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అయితే రాజేంద్ర ప్రసాద్ ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేయడం జరిగింది. ఒక సినిమా ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులోనే చూసుకుంటారని తెలిపారు.
తాను కూడా మా అమ్మను కూతురులో చూసుకుంటున్నానని తెలియజేయడం జరిగింది.. రాజేంద్రప్రసాద్ కు 10 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో తల్లి చనిపోయారని తెలిపారు. నాకు నా కూతురికి మాటలు లేవని రాజేంద్రప్రసాద్ తెలిపారు. తన కూతురు లవ్ చేసిన వ్యక్తితో వెళ్లిపోయిందని రాజేంద్రప్రసాద్ తెలియజేయడం జరిగింది. రాజేంద్రప్రసాద్ నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఎలాంటి పాత్రలో నటించిన ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు. రాజేంద్రప్రసాద్ ఎన్నో చిత్రాలలో ఎంతో అద్భుతంగా పోషించగలరు. రాజేంద్రప్రసాద్ కొడుకు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం ఆ మధ్య జరిగిన అందులో నిజం లేదని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ వయసు 66 సంవత్సరాలు.. ఇక ఆయన నటుడుగా ఎంత ఎదిగినా కూడా అంత ఒదిగి ఉంటారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఒక చిత్రానికి రోజుకు మూడు లక్షల రూపాయలు రేంజ్ లో రింగుల దేశం తీసుకుంటున్నట్లు సమాచారం. ఎన్నో సినిమాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కూడా నటించి మెప్పించారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ గురించి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.