నిన్న రాత్రి ఫిలింనగర్ లోని మంచు లక్ష్మీ నివాసంలో మంచు మనోజ్ – మౌనిక రెడ్డిల పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది ఈ వివాహానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.. ఈ క్రమంలోని నిన్న ఉదయం తన కాబోయే భార్య మౌనిక రెడ్డి పెళ్లికూతురు గెటప్ లో ఉన్న ఫోటోలు షేర్ చేసి మనోజ్ వెడ్స్ మౌనిక అని.. వ్యక్తిగత జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి.. చాలా సంతోషంగా ఉంది అంటూ కామెంట్లు చేశారు. మనోజ్ వివాహం చేసుకున్నారు కాబట్టి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మంచు లక్ష్మి ఇంట్లోనే మనోజ్ పెళ్లి ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. మంచు లక్ష్మి చాలా సందర్భాలను తనకు మనోజ్ అంటే చాలా ఇష్టమని మనోజ్ ను కొడుకులా చూసుకుంటానని చెప్పుకొచ్చారు. మనోజ్ కి కూడా కెరియర్, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మంచు లక్ష్మి అండగా నిలిచారు. అంతేకాదు నెగిటివ్గా ఎలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చినా సరే మంచు లక్ష్మి అసలు తట్టుకోలేరు.. అంతేకాదు మంచు మనోజ్ పెళ్లి రూమర్ల విషయంలో కూడా ఆమె చాలా సీరియస్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు మంచు మనోజ్ పెళ్లికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఉన్న నేపథ్యంలో ఆమె పెళ్లి పెద్దగా మారారు. మనోజ్ పై ఉండే ప్రేమ, అభిమానం వల్లే మంచు లక్ష్మీ తన ఇంట్లో ఈ పెళ్లి వేడుక చేయడానికి ఒకే చెప్పారని సమాచారం.
ముఖ్యంగా మనోజ్ పై మంచు లక్ష్మీ చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరూ కూడా ఫిదా అవుతున్నారు. అంతేకాదు తన తమ్ముడి పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి మరి చూసుకుంది మంచు లక్ష్మీ. మొత్తానికి అయితే తమ తమ్ముడి పై ఉన్న ప్రేమను ఏ విధంగా చూపిస్తోంది మంచు లక్ష్మి.