టాలీవుడ్ లో అక్కినేని నాగేశ్వరరావుకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలిసిందే .ఒకప్పుడు ఆయన సినిమాలు చూడటానికి థియేటర్లో మంచి విజయాలను అందుకున్నాయి.తెలుగు దిగ్గజ నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు ఎదగటానికి ఈ దర్శక నిర్మాతలు కారణం. ఆయన ఎవరో కాదు దగ్గుపాటి మధుసూదన్ రావు, గూడవల్లి రామబ్రహ్మం వీరి తర్వాత అదే స్థాయిలో అక్కినేని విజయాలను అందించిన వ్యక్తి రాజేంద్రప్రసాద్
రాజేంద్రప్రసాద్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు ఆయన ఎవరో కాదు జగపతిబాబు తండ్రి ఇక జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ అనే బ్యానర్లు స్థాపించింది రాజేంద్రప్రసాద్. నిర్మాతగా అక్కినేని వారితో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. వీరిద్దరికీ మంచి స్నేహం కూడా ఉండేది. ఈ క్రమంలోనే అక్కినేని మరియు వాణిశ్రీ హీరో, హీరోయిన్గా దసరా బుల్లోడు చిత్రం తీయాలని రాజేంద్రప్రసాద్ గారు అనుకున్నారు. కానీ ఆ సినిమా కోసం అనుకున్న దర్శకుడు వేరే సినిమాతో బిజీగా ఉండటంతో అక్కినేని గారు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించమని కోరారు.
రాజేంద్రప్రసాద్ దర్శకత్వం చేయకపోతే నేను సినిమా చేయను అంటూ షరత్ పెట్టారట అలా అక్కినేని బలవంతం పెట్టడంతో దసరా బుల్లోడు దర్శకత్వం రాజేంద్రప్రసాద్ వహించారు. అయితే ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాతోనే ఇంకాస్త వీరిబంధం బలపడింది. అయితే ఒక టైం లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిందట
అయితే దసరా బుల్లోడు సినిమా టైంలో రాజేంద్రప్రసాద్ ఒక హీరోయిన్ తో క్లోజ్ గా ఉండేవారట.ఆ విషయాన్ని కొంతమంది మిత్రులతో అక్కినేని చెప్పారట. ఆ విషయం ఆ నోట ఈ నోటా పాకి రాజేంద్రప్రసాద్ దగ్గరికి వచ్చి చేరింది. రాజేంద్రప్రసాద్ కోపంతో నేరుగా అక్కినేని దగ్గరికి వెళ్లి నిలదీశారట. నా పర్సనల్ విషయాలు అందరితో చెప్పాల్సిన అవసరం ఏం వచ్చింది. అంటూ పెద్ద గొడవ జరిగిందట. అలా వీరిద్దరి మధ్య మాటలేవని సమాచారం.