తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో చిత్రాలలో నటించిన హేమ ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో కనిపించలేదు. హేమ సినిమాలతో బిజీగా ఉండాలని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు.. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలలో నటించిన హేమ సినిమాలు మానేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.
తాజాగా హేమ స్పందిస్తూ. . తాను బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉన్నందువలన సినిమాలలో నటించడం లేదని తెలిపింది. త్వరలో బిజినెస్ కు సంబంధించి అన్ని వ్యవహారాలను కూడా తెలియజేస్తానని హేమ తెలియజేసింది. హేమ ప్రస్తుతం వయసు 56 సంవత్సరాలు కావడంతో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హేమ కచ్చితంగా ప్రయత్నిస్తే మంచి ఆఫర్లు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ఇక హేమ రెమ్యూనరేషన్ ప్రస్తుతం రోజుల్లో రూ .2 లక్షలకు పైగా అటు ఇటుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో ఎక్కువగా ఈమె కనిపిస్తూ ఉండేది. ఇక హేమ కెరియర్ రాబోయే రోజుల్లో ఎలా ప్లాన్ చేసుకుంటుందో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక హేమాతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఇతర వ్యాపారాలలో అడుగుపెట్టి.. సక్సెస్ సాధించారు. మరి హేమ కూడా వ్యాపారాలలో సాధిస్తూనే సినిమాలలో నటిస్తూ బ్యాలెన్స్ చేస్తుందేమో చూడాలి మరి. ఇక హేమ కూడా ఎప్పుడూ కూడా పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బ్రహ్మానందం, హేమ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో కామెడీ చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. మరి రాబోయే రోజుల్లో హేమ నటిస్తుందేమో చూడాలి మరి.