మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో గిట్టని వారు ఎవరైనా ఉన్నారని అంటే అది నటి శ్రీరెడ్డి మాత్రమే అని చెప్పవచ్చు.. తరచు మెగా కుటుంబం పై పలు రకాల కామెంట్ చేస్తూ ఫైర్ అవుతూ ఉంటుంది. గతంలో నుంచి క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేస్తూ ఉండేది శ్రీరెడ్డి కానీ ఆమె నోటి దూల వల్ల వచ్చిన క్రేజీను పోగొట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఎలాంటి అవకాశాలు లేక సోషల్ మీడియా ద్వారా తన మనసులో ఉండే భావాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే చాలు ఆమెకు ఎక్కడలేని కోపం వస్తుంది.ప్రస్తుతం ఆమె వైసీపీ పార్టీకి మద్దతుగా పనిచేస్తుంది అందుకే జనసేన మీద పలు రకాల కామెంట్లు చేస్తూనే ఉంటోంది .ఇదంతా ఇలా ఉండగా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కొన్ని రోజులుగా అసలు పడట్లేదు అనే విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతూనే ఉంది. ఈ విషయంలోకి తాజాగా శ్రీ రెడ్డి ఎంట్రీ అయ్యి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
శ్రీ రెడ్డి మాట్లాడుతూ అసలు మెగా ఫ్యామిలీ అంతా భజన గాళ్లే ఒకరితో ఒకరు భజ చేయించుకొని బతుకుతూ ఉన్నారు.. అందులో ఏ ఒక్కడికి కూడా యాక్టింగ్ రాదు కేవలం అల్లు అర్జున్ ఒక్కడే అసలైన మగాడు మిగతా వాళ్లంతా చెత్త గాళ్లే అంటూ ఆరోపించింది శ్రీరెడ్డి.. కేవలం బన్నీ మాత్రమే తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎదిగారని తెలియజేసింది. మిగతా వారంతా ఇతర హీరోలను తొక్కేసి మీదికి వస్తున్నారు అంటూ వారిపైన ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి.
శ్రీ రెడ్డి చేసిన కామెంట్లు మెగా ఫాన్స్ నీ ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇలాంటి నీచమైన కామెంట్లు ఎలా చేస్తావ్ అంటూ పలువురి నెటిజన్లు సైతం శ్రీరెడ్డి పైన ఫైర్ అవుతున్నారు. గతంలో అడపా దడపా సినిమాలలో నటించిన శ్రీరెడ్డి ఈ మధ్యకాలంలో పెద్దగా నటించలేదు. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.