మెగా హీరోలలో ఒకరైన సాయి ధరంతేజ్ తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ట్రైలర్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో కీలక విషయాలను కూడా తెలియజేశారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ వయసు 36 సంవత్సరాలు కాక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ఈ హీరో వివాహం ఎప్పుడు అంటూ అభిమానులు అక్కడ పలు ప్రశ్నలకు వేయడంతో వారికి సరైన సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఈవెంట్లో పెళ్లి గురించి చెప్పాలని అభిమానులు కోరగా.. సాయి ధరమ్ తేజ్ కాస్త సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.
సాయి ధరంతేజ్ మాట్లాడుతూ మీరు ఎప్పుడు అమ్మాయిలను గౌరవించడం నేర్చుకుంటారో అప్పుడే నా పెళ్లి జరుగుతుందని తెలిపారు.. ఇక ఫ్యాన్స్ వల్ల అయితే మాత్రమే నా పెళ్లి ఎప్పుడో అయిపోయిందంటూ సాయి ధరంతేజ్ కామెంట్లు చేయడం జరిగింది.. ఇప్పటికే నాకు నాలుగు సార్లు పెళ్లయిందని సాయి ధరమ్ తేజ్ తెలిపారు. అయితే సాయి నటించిన సినిమాలలో జరిగిన పెళ్లిళ్ల గురించి ప్రస్తావించారని వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు.
ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని అభిమానులు కూడా భావిస్తున్నారు. నెంబర్ల కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుగా ఈ చిత్రాన్ని మురళి శర్మ డైరెక్టర్ తన కామెడీ టైమింగ్ తో ఈ సినిమాని హైలెట్గా నిలిచెలా చేసేలా ఉన్నట్లు ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ట్రైలర్లు ఆడపిల్లల గురించి చెప్పే విధానం కూడా చాలా బాగున్నట్టుగా ట్రైలర్ చూసిన ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఇక కిరాణా భవరం కూడా విభిన్నమైన కథలతో నటిస్తూ ఉంటారు. ప్రస్తుతం సాయి ధరంతేజ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.