తమన్నాకి కాస్ట్లీ బంగ్లా కొనిచ్చిన కోలీవుడ్ హీరో..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా హీరోయిన్స్ ని తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉండడం జరుగుతోంది .ఇలా ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చారు. అలా ఇండస్ట్రీలో రాణిస్తున్న వారిలో హీరోయిన్ తమన్నా కూడా ఒకరు.ఈమె మొట్టమొదటిగా శ్రీ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.ఆ తరువాత హ్యాపీడేస్ చిత్రంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తరువాత స్టార్ హీరోలందరితో సినిమా అవకాశాలను దక్కించుకొని ఇప్పటికీ హీరోయిన్ గా మెప్పిస్తోంది తమన్నా. ఈ మధ్యనే బాలీవుడ్ నటుడైన విజయవర్మతో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే

Watch: Karthi romances Tamannaah in 'Oopiri'
అంతేకాకుండా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే తమన్నా గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. హీరోయిన్ తమన్నా తమిళ హీరో అయినా కార్తీక్ వీరిద్దరూ కలిసి ఆవారా సినిమాలో నటించారు. ఆ టైంలోనే తమన్నా, కార్తీ ఇద్దరు ప్రేమలో పడ్డారట.అప్పుడే కార్తీ, తమన్నా కి కాస్ట్లీ ఫ్లాట్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడని కోలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి..అది కూడా చెన్నైలోనే ఆ ఫ్లాట్ కొనుగోలు జరిగిందట.

అయితే వీరిద్దరూ ప్రేమించుకోవడమే కాదు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారట.కానీ కార్తీ వాళ్ళ పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ విడిపోయారని సమాచారం..అయితే అప్పుడే తమన్నా ఆ ఫ్లాట్ ని వెనక్కి తిరిగి ఇవ్వాలని అనుకుందట. కానీ కార్తీ మాత్రం నాకు వద్దు నీ దగ్గరే ఉంచుకో అని చెప్పాడట. ఇప్పటికీ కూడా ఈ ఫ్లాట్ తమన్నా పేరు మీదే ఉందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ తాజాగా తమన్నా గురించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share.