టాలీవుడ్ ఇండస్ట్రీకి పెళ్లి సందD చిత్రం ద్వారా పరిచయమైంది కన్నడ బ్యూటీ శ్రీ లీల.. ఈమె కన్నడలో కూడా మంచి చిత్రాలను నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. శ్రీ లీల డాన్స్ పరంగా అలాగే నటన పరంగా ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుతుంది. ఇంత సక్సెస్ను సాధించిన అమ్మడి చేతిలో దాదాపు10 సినిమా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో బిజీనా మారిపోయింది. కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి కొన్ని షూటింగ్ జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇటీవల బేబీ సినిమా సక్సెస్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ కూడా ఈమెను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అంటే అలాంటివి లేవు తన సొంతం చేస్తుందనే చెప్పాలి. ఇదిలా ఉండగా శ్రీ లీల విజయవంతమైన ప్రయాణం గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి జోస్యం చెప్పారు. ఈయన గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఆయన చెప్పిన జ్యోతిష్యం చాలా వరకు నిజమయ్యాయి. అందుకని ఇప్పుడు శ్రీ లీల సినిమా కెరీర్ ఎలా ఉండబోతుందో కూడా చెప్పారు.
వేణు స్వామి ఏం చెప్పారంటే ఆమె చాలా సంవత్సరాలు అగ్రనటిగా కొనసాగుతుందని అంతేకాకుండా సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ గా కూడా కొనసాగుతుందని ఈమె రాశి మీనరాశి ఈమె జాతకంలో శక్తివంతమైన రాజయోగం ఉంది.. మంచి పేరు ప్రఖ్యాతలు పెరిగే లక్షణాలు కూడా ఉన్నాయి. 2028 వరకు తెలుగు ఇండస్ట్రీలో ఆమె హవా సాగిస్తుందని వేణు స్వామి జ్యోతిష్యం ద్వారా అంచనా వేశారు.అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార, శ్రీ లీల జాతకం ఒకటే లా ఉందని వేణు స్వామి అంచనా వేశారు. ఇలా వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యాలన్నీ సక్సెస్ అయ్యాయి. కాబట్టి శ్రీ లీల కెరీర్ విషయంలో ఆచితూచి అడుగు వేస్తే ముందుకు సాగే అవకాశం ఉంది.