టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకప్పుడు మంచి ఫ్యాన్ ఫాలో కలిగిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో తెరకెక్కించిన లైగర్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై భారీ డిజాస్టర్ కావడంతో నిర్మాతలు పూరి జగన్నాథ్ పేరు వింటే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమాలో నటించిన హీరోయిన్ రక్షిత ప్రతి ఒక్కరికి సుపరిచితమే. గతంలో ఈ ముద్దుగుమ్మ పూరి జగన్నాథ పైన పలు ఆసక్తికరమైన కామెంట్లు చేసింది వాటి గురించి తెలుసుకుందాం.
ఇడియట్ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలు జరిగినట్లుగా తెలియజేశారు పూరి జగన్నాథ్.. పూరి జగన్నాథ్ ఎప్పుడు కూడా కోపంలో సమాధానాలు అసలు సమాధానం చెప్పకూడదని తెలియజేశారు. రక్షిత తో ఇడియట్ సినిమా షూటింగ్ సమయంలో ఒక సన్నివేశంలో రక్షిత సరిగ్గా చేయడం లేదని కోప్పడ్డాడట పూరి.. అంతేకాకుండా ఏడ్చే సన్నివేశంలో నవ్వుతూ ఉండడంతో తనకు చాలా కోపం వచ్చిందని తెలిపారు పూరి జగన్నాథ్.
ఆ సమయంలో నేను రక్షితతో రక్షిత నువ్వు ఫోకస్ చేయడం లేదు.. ఇలా చేస్తే తర్వాత సినిమాలో క్యారెక్టర్ రాయను అని పూరి జగన్నాథ్ ఆమెతో తెలియజేశారట. ఆ సమయంలో రక్షిత పూరి జగన్నాథ్ ను క్యారెక్టర్ రాయి రాకపోతే చంపేస్తానంటూ బెదిరించిందని కామెంట్లు చేసినట్లుగా తెలియజేశారు. అయితే పూరి తో 10 సినిమాలు నటిస్తానని చెప్పిందట. అయితే పూరి ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పు చావు అంటూ కామెంట్ చేసిందని పూరి తెలిపారు.
అయితే రక్షిత అలా అనడంతో పూరికి నవ్వు ఆగలేదట. రక్షిత నుంచి ఊహించని విధంగా సమాధానం రావడంతో ఆమె పైన కోపం పోయిందని పూరి జగన్నాథ్ తెలియజేయడం జరుగుతోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అలా గాడ్ ఫాదర్ సినిమాలో ఒక న్యూస్ రిపోర్టర్ గా నటించారు. ప్రస్తుతం తన తదుపరిచిత్రాన్ని బాలీవుడ్ హీరో కోలీవుడ్ హీరో తో తలకెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం.