టాలీవుడ్ లో టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు శివ ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. అలా నిన్ను కోరి ,మజిలీ సినిమాలను తీసి దర్శకుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తరువాత నానితో టక్ జగదీష్ సినిమా తీసి అనుకున్న స్థాయికి రీచ్ కాలేకపోయాడు. అయితే వెంటనే విజయ్ దేవరకొండ ,సమంత కాంబినేషన్లో ఖుషి టైటిల్ ని పెట్టి షూ
ఇంతలో సమంత ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడప్పుడే మామూలు స్థితిలోకి వచ్చేలా కనిపించలేదు.. దీంతో సామంత త్వరలోనే రికవరీ కాబోతోందని అభిమానులు భావిస్తున్నారు. మరల మునుపటి ఫిట్నెస్ కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది.
శాకుంతలం సినిమా రిలీజ్ తర్వాత మార్చి మొదటి వారంలో శివ దర్శకత్వంలో ఖుషి మూవీ రెగ్యులర్ షూటింగ్ మళ్లీ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే సమంతకు కూడా ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ సమంత మార్చి మొదటివారం షూటింగ్ కి రాకపోతే ఆ మూవీని పక్కన పెట్టి మరో ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటంటే మెగా ఫ్యామిలీ హీరోతో సినిమాకి శివ కమిటీ అయినట్లు తెలుస్తోంది. వారి డేట్స్ అందుబాటులో ఉండటంతో సమంత కోసం అప్పటివరకు వేచి చూసి తర్వాత ఖుషి మూవీ పై ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సమంత కూడా వీలైనంత త్వరగా కోలుకొని ఖుషి మూవీ షూటింగ్ కి వెళ్లాలని భావిస్తోంది. అయితే సమంత ఆరోగ్యం ఆ సమయానికి సహకరిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.