ఒకప్పుడు యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్గా పేరు తెచ్చుకుంది రాశి. అప్పట్లో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలు అందుకునేవి. ముఖ్యంగా పవన్ తో గోకులంలో సీత అనే సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే శుభాకాంక్షలు, పెళ్లిపందిరి, ప్రేయసి రావే తదితర చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది.
అలా చాలా రోజులపాటు ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే హీరోయిన్గా కెరియర్ ముగిసిన తర్వాత వెంకీ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కూడా అలరించింది. అలాగే డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో విలన్ గా గోపీచంద్ పక్కన కీపుగా నటించింది. ఈ క్యారెక్టర్ లో చేసిన ఈమెకి జనాలనుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అంతేకాకుండా ఈ క్యారెక్టర్లో ఇమెను చూసిన వారంతా అప్పట్లో హీరోయిన్గా చేసిన రాశి ఇవీడేన అనే విధంగా డౌట్ పడడం జరిగిందట. అలా రాశికి కూడా మైనస్ గా మారింది ఈ చిత్రము.
అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా రాశి.. ఈ పాత్ర గురించి మాట్లాడుతూ..డైరెక్టర్ తేజ నాకు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెప్పలేదు.. కేవలం రౌడీ భార్యగా చేయాలంటే నేను ఒప్పుకున్న తీరా టైం కు నాకు ఈ క్యారెక్టర్ చెబితే నేను చేయలేనని చెప్పాను అప్పుడు తేజ లేదు చేయాలని చెప్పారట. ఒకవేళ మీరు చేయకపోతే ఈ సినిమా షూటింగ్ ఆగిపోతుందని చెప్పారట. ఎంత చెప్పినా వినకపోవడంతో తప్ప లేక క్యారెక్టర్ చేశానని చెప్పింది. ఆ రొజు క్యారెక్టర్ గురించి ముందే పూర్తిగా చెప్పకుండ తేజ గారు నన్ను మోసం చేశారని తెలిపింది రాశి. ఇక అప్పటినుంచి తనకు ఏదైనా పాత్ర వచ్చిందంటే పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఓకే చెబుతున్నానని తెలిపింది.