టాలీవుడ్లోకి వెన్నిరాడై చిత్రంతో హీరోయిన్గా అడుగు పెట్టింది వెన్నిరాడై నిర్మల. అంతేకాకుండా అటు తమిళంలో ఇటు తెలుగులో ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి ఈమె. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కలిసి సినిమాల్లో నటించి సందడి చేసింది. అంతేకాకుండా ఎంతోమంది సీనియర్ హీరోలకి హీరోయిన్లకి తల్లి పాత్రలలో నటించింది. ఇలా హీరోయిన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 400 సినిమాలకు పైగాని నటించింది.
అయితే ఇమే తాజగా ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. నాకు కూడ కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్య అంటూ పలు విషయాలను తెలియజేశారు. ఇకపోతే తన సినీ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమా పేరు హీరో పేరు చెప్పకుండా ఓ హీరో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరోజు సినిమా షూటింగ్ చేసుకుని ఇంటికి వచ్చానని.. అయితే ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో నాతో కలిసి నటిస్తున్నటువంటి హీరో తప్ప తాగి ఇంటికి వచ్చి తన ఇంటి తలుపులు కోట్టారని తెలిపారు. ఆ హీరో ఇంటి తలుపులు కోట్టడంతో తాను తలుపు తీయలేదని ఆయన మాత్రం ఒక్కసారి తలుపు తీయండి నేను ఏమీ చేయను కేవలం మీ పక్కన నిద్రపోయి వెళ్ళిపోతాను అన్నాడట. ఆ మాటలకు ఆమె భయపడి తలుపు తీయకుండా అలాగే ఉండిపోయిందట
మరల తర్వాతి రోజు నుంచి తను షూటింగ్ కి కూడా వెళ్లలేదని ఆమె తెలిపారు. ఆ సినిమా దర్శకనిర్మాతలు తనను ఒప్పించే ప్రయత్నం చేసిన నేను ఈ సినిమాలో నటించానని కరాకండిగా చెప్పేశానని తెలుపుతోంది.ఇలాంటి వాటిని నేను అసలు సహించను అంటూ నిర్మల ఇంటర్వ్యూ సందర్భంగా తన మనసులోని మాటలను బయటకు పెట్టారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.