ప్రభాస్ హీరోగా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. ఈ చిత్రం రెండు భాగాలు ఉంటుందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ సలార్ ఫస్ట్ పార్ట్ మాత్రం కొన్ని నెలల గ్యాప్ లోనే థియేటర్లో విడుదల అయ్యేందుకు ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తోంది. సలార్ మొదటి భాగం క్లైమాక్స్లో సెకండ్ పార్ట్ గురించి స్పష్టత వస్తుందని.. త్వరలోనే ఆ సీక్రెట్ ను చిత్ర బృందం థియేటర్లోనే రివీల్ చేస్తుందని సమాచారం.
ఇక కథపరంగా సలార్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కించాల్సిన సబ్జెక్టు కావడంతో డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్, కే జి ఎఫ్ టు సినిమాలను చూసిన ప్రేక్షకులు ఏ స్థాయిలో అంచనాలను పెట్టుకున్న అసలు నిరుత్సాహం పడకుండా ప్రశాంత్ నీల్ నమ్మకంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పుడు అదే స్థాయిలో కూడా ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాని మొదటి పార్ట్ థియేటర్లో విడుదల కావడానికి కేవలం 9 నెలలు మాత్రమే ఉన్నది. అయితే ఈ సినిమా పైన పబ్లిసిటీ దృష్టి మాత్రం పెద్దగా పెట్టినట్లు కనిపించలేదు.
ప్రశాంత్ నీల్ రిక్వెస్ట్ వల్ల ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించిన మరొక నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. సలార్ సినిమాలో ప్రభాస్ హీరో కాగా పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ పాత్రలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో తన పాత్ర నేగిటివ్ పాత్ర ఉన్నప్పటికీ ఇందులో చాలా ప్రత్యేకంగా కనిపిస్తానని తెలిపారు పృథ్విరాజ్ సుకుమారన్. ప్రభాస్ తన మధ్య వచ్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని తెలిపారు. ఈ సినిమా పృధ్విరాజ్ బిజినెస్ పరంగా కూడా హెల్ప్ అవుతుందని ఈ చిత్రంలో నటించినట్లు తెలుస్తోంది.