తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి పాపాలంటే సంపాదించుకున్నది హీరోయిన్ రష్మిక. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగులో మొదట ఛలో సినిమాతో అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత గీతగోవిందం వంటి సినిమాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రష్మిక. ఇక అల్లు అర్జున్తో పుష్ప సినిమా మహేష్ తో సరిలేరు నీకెవ్వరు తదితర చిత్రాలతో నటించి పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు పొందింది. దీంతో ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా కూడా పేరుపొందింది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే రష్మిక ఎంతటి పాపులర్ అయితే సొంతం చేసుకుందో.. అదే స్థాయిలో ఎన్నో కాంట్రవర్సీలను సైతం ఎదుర్కొంటోంది. రష్మికపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రష్మిక చేసిన కామెంట్స్ పైన నెట్టింట కొంతమంది పని కట్టుకొని మరి కామెంట్లు చేస్తున్నారు. దీంతో తనపై వస్తున్న ట్రోలింగ్ పైన రష్మిక స్పందించడం జరిగింది. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉన్నది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
రష్మిక మాట్లాడుతూ నటీనటులుగా ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలనుకోకూడదని నాకు తెలిసి వచ్చిందని ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉండడం వల్ల అందరి దృష్టి మనపైనే ఉంటుందని.. అలా అని నేను అందరికీ నచ్చుతాననుకోలేదు నా విషయానికి వస్తే నేను మాట్లాడే విధానం వ్యవహార శైలి మాటలు ఇతరులకు నచ్చకపోవచ్చు.. అందుచేతన తన పైన కామెంట్స్ , ట్రోల్స్ చేస్తూ ఉంటారని తెలియజేస్తోంది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారుతోంది.
View this post on Instagram