డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ తాప్సి. ఈ చిత్రంలో హీరోగా మంచు మనోజ్ నటించారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్న తాప్సీ కి మాత్రం పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఆ తర్వాత టాలీవుడ్ లో ప్రభాస్, రవితేజ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ. కానీ ఇక్కడ మాత్రం స్టార్ స్టేటస్ ను అందుకోలేకపోయింది. వాటికి తోడు తాప్సి సెన్సేషనల్ కామెంట్స్ చేయడం వల్ల అందరూ ఈమెనే టార్గెట్ చేశారు అనే వార్తలు గతంలో వినిపించాయి.
ఇక తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సి.. జుడ్వా -2 లో నటించి తన గ్లామర్ తో బికినీ ట్రీట్ తో అందరిని ఆకట్టుకుంది. అక్కడ కూడా అది కొద్దికాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది. కానీ బాలీవుడ్లో మాత్రం స్కిన్ షో చేస్తేనే అవకాశాలు వస్తాయని గ్రహించింది ఈ ముద్దుగుమ్మ.. అమితాబచ్చన్ తో కలిసి నటించిన పింక్, బద్లా వంటి సినిమాలు తాప్సి కెరీర్ను మార్చేశాయి. టింకు టాలీవుడ్ బాలీవుడ్ లో రీమేక్ అయినప్పుడు తాప్సి గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు.
అయితే బాలీవుడ్ కంటే టాలీవుడ్ వాళ్లు హీరోయిన్ చూపించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుందని కామెంట్లు చేసింది.అంతేకాకుండా తన మొదటి సినిమాలో బొడ్డు మీద కొబ్బరికాయలు వేయవలసిన అవసరం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదని డైరెక్టర్ మీద కామెంట్లు చేసింది. ఇది తాప్సికి చాలా ఇబ్బందులను తెచ్చిపెట్టిందని వార్తలు వినిపిస్తుంటాయి. దీంతో ఒక రకంగా టాలీవుడ్ లో ఈమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోవడానికి కారణం ఇదే అని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మరి అసలు విషయం ఏంటన్నది తాప్సీ ని స్పందించాల్సి ఉంటుంది.