సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం వెనుక ఎన్నో కథలు వినిపిస్తూ ఉంటాయి. అయితే కైకాల సత్యనారాయణ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు టిడిపి పార్టీ ఎందుకు పెట్టవలసి వచ్చిందనే ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రామారావు గారి దగ్గర తనకు చాలా ఫ్రీడమ్ ఉండేదని రామారావు గారు చనిపోయే వరకు ఆయనతో అనుబంధం బాగా కొనసాగిందని కైకాల గతంలో తెలియజేశారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన మా ఇంటికి వచ్చేవారని తెలిపారు కైకాల. ప్రజల రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలని ఆలోచనతోనే టిడిపి పార్టీ పెట్టానని ఎన్టీఆర్ చెప్పానని కైకాల తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ జాతకం ప్రకారం 60 సంవత్సరాల తర్వాత లైన్ మార్చేయాలని ఉందని అందుకే ఆయన పొలిటికల్ వైపు అడుగులు వేశారని తెలిపారు.
ఇక అలాంటి సమయంలో కొంతమంది రాజకీయాల వైపు వెళ్ళమని సలహా ఇవ్వడం జరిగింది. అయితే ఒకానొక సమయంలో సరోజిని పుల్లారెడ్డి గారు సీనియర్ ఎన్టీఆర్ను కలవడానికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ను కలవకుండా అవమానించాలని ఆ తరువాత వెంకట్రామిరెడ్డి గారు కూడా సీనియర్ ఎన్టీఆర్ ఒకానొక సందర్భంలో లోపలికి రానివ్వలేదట. ఇలా ఎన్నో అవమానాల మధ్య ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావలసి వచ్చిందని తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో సంచనాలను సృష్టించారని తెలిపారు.
సీనియర్ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల వల్ల ప్రజలు ఎంతగానో ప్రయోజనం పొందుతున్నారని. సీనియర్ ఎన్టీఆర్ పథకాలు ఈ జనరేషన్లో ప్రజలు కూడా మంచి పథకాలుగా పేరు తెచ్చుకున్నారని కైకాల గతంలో తెలియజేశారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రజలకు దూరమైనప్పటికీ ఆయన చేసిన పనులు మాత్రం జరగని ముద్ర వేసుకున్నాయని తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది