టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే ప్రక్కన సుకుమార్ పేరు గుర్తుకువస్తుంది. ఇక ఈయన దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సుకుమార్ తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇలా తెలుగు తెరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు సుకుమార్. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన రంగస్థలం సినిమా ఎలాంటి హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే.. రామ్ చరణ్ కెరియర్ లో కూడా ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
హీరోయిన్గా సమంత అద్భుతమైన నటన ప్రదర్శించింది ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ లో ఇలాంటి మాస్ యాంగిల్ కూడా ఉందని నిరూపించారు సుకుమార్. ఇప్పుడు తాజాగా హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ నటించిన 18 పేజీస్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం జరిగింది. సుకుమార్ మాట్లాడద్దు రంగస్థలం సినిమా కోసం మొదట తాము సమంతని హీరోయిన్గా అనుకోలేదు అనుపమ పరమేశ్వరన్ నే హీరోయిన్గా అనుకున్నాము.
అనుపమ ఆడిషన్స్ కి కూడా వచ్చిందని తెలిపారు. తనను ఆడిషన్ చేస్తున్న సమయంలో అనుపమ భయంతో తన తల్లి వంక చూస్తూ ఉంది అది గమనించిన సుకుమార్ ఈమె స్థానంలో సమంతఎంపిక చేసినట్లు సుకుమార్ 18 పేజీస్ ఫ్రీ రిలీజ్ వేడుకలో రంగస్థలం సినిమా గురించి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం సుకుమార్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. 18 పేజీస్ సినిమా ని డైరెక్టర్ సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు ఈ సూర్య ప్రతాప్ సుకుమార్ శిష్యుడే.